జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం నరసింహ స్వామి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాదరావు దేవాలయంలో అర్చనలు అభిషేకాలు పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకుతీర్థ ప్రసాదాలు అందించారు.మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నరసింహస్వామి దేవాలయం నిర్వాహకులు నామాల కృష్ణ, అరవిందరావు,బాబురావు, అనిల్ రావు, ఉప్పరినారాయణ,నామాల వినోద్,ఆంజనేయులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

