Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హత్యలే రాజకీయం గా ఎదిగిన వైఎస్ కుటుంబం

హత్యలే రాజకీయం గా ఎదిగిన వైఎస్ కుటుంబం

Satyam NEWS 5 hrs ago

త్య రాజకీయాలకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు తమ రాజకీయ ఎదుగుదలల్లో ఎందరో అమాయకులు హత్య చేయబడ్డారని ధ్వజమెత్తారు.

వైస్ కుటుంబం రాజకీయ కుటుంబం కానే కాదని.. బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ కాలంలోనే భారతీయులకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపించారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. వైఎస్ కుటుంబంలోని మూడు తరాల హత్య రాజకీయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.

"వార్డు మెంబర్ స్థానానికి ఓడిపోయినా నీచ చరిత్ర వైఎస్ కుటుంబానిది. 1968 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమ్మగారు వైఎస్ జయమ్మ.. గాడిచర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిపై ఓడిపోయారు. 1962లోనే రాజారెడ్డిపై రౌడీషీటర్ కేసు ఉంది. ఆ తర్వాత మంగంపేట బైరటీస్ గనుల్లో బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర చేరారు. పెట్టుబడి లేకుండా ఆయన తన వ్యాపారంలోకి రాజారెడ్డిని తీసుకున్నారు. అనంతరం కాలంలో ఆయన్ని హత్య చేశారు. ఆ హత్యా రాజకీయ పునాదిపై రాజారెడ్డి ఎదిగారు. ఆ హత్యకు సహకరించిన పౌలిరెడ్డి అనే వ్యక్తి అనుమానస్పాద మృతి చెందారు. ఆ తర్వాత త్రివేణి స్టీల్ యజమాని మురళి రెడ్డిని హత్య చేశారు.

ఆ హత్య జరిగిన తరువాతే కొళ్లం గంగిరెడ్డి కుటుంబంతో బంధం ఏర్పడింది. 1989 చిన్నముడియం గ్రామంలో రిగ్గింగ్ చేయడానికి వెళ్లారు. ఆ గ్రామస్థులు రాజారెడ్డిని తీవ్రంగా అడ్డుకున్నారు. ఆ తరువాత శివారెడ్డి హత్యకు ప్లాన్ చేశారు. శివారెడ్డి మరణం తర్వాతే వైఎస్ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారు.

శాంతి ప్రవచనాలు చెబుతున్న జగన్ రెడ్డి పేర్ల పార్థసారథి రెడ్డికి సమాధానం చెప్పాలి

పులివెందులల్లో అనేక హత్యలతో రాజారెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబందాలు ఉన్నాయి. రాజకీయాల్లో రాజారెడ్డికి వ్యతిరేకంగా పోటీచేసిన పేర్ల పార్థసారథి రెడ్డిపై హత్యాయత్నం చేశారు. కత్తులతో నరికారు అయినా ఆయన బతికి బట్ట కట్టారు. ఆ తర్వాత పార్థసారథి రెడ్డి వర్గీయులు రాజారెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత వాళ్ల సోదరుడు ఉమా రెడ్డి కూడా హత్య గావించబడ్డారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, భారతీ రెడ్డి తండ్రి గంగిరెడ్డి మిగతా కొందరు ముద్దాయిలుగా ఉన్నారు. ఆ తర్వాత అధికారం అడ్డం పెట్టుకొని పేర్ల పార్థసారథి రెడ్డి వర్గీయులను జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేశారు. వాళ్లను కోర్టులో పెట్టి కనీసం పెరోల్ రాకుండా చేసి కుటుంబాలకు దూరం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్లను ఏం చేయలేదని మాట్లాడటం సిగ్గు చేటు."

కడపలో రిగ్గింగ్ పాల్పడి గెలిచిన నీచ చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది

" ఆ తర్వాత రాజారెడ్డి వారసుడు రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు అన్ని ఇన్ని కావు. లింగాల మండలంలో పెద్ద గూడల కృష్ణారెడ్డిని హత్య చేయించారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న ముద్దాయిలను పోలీసు స్టేషన్ లో ఉంచి.. రాజశేఖర్ రెడ్డి అదే సమయంలో హైదరాబాద్ లో ఓ మిలటరీ అధికారితో గొడవపడ్డారు. ఎవరికి అనుమానం రాకుండా ఈ కేసు నుంచి తప్పించుకున్నారు.

రిగ్గింగ్ చేసేందుకు డైనమైట్స్ పెట్టి లింగాలమండలంలో భయాందోళనలు సృష్టించారు. ఆ తరువాత రఘురామిరెడ్డిని హత్య చేశారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న విలేకరి నారాయణ, నంద్యాపల్లి శివరామిరెడ్డిని హత్య చేశారు. ఈ హత్యలతో పులివెందుల టౌన్ ను వైఎస్ కుటుంబానికి సరండర్ అయ్యింది."

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డికి వాళ్ల నాన్న మరణం గుర్తుకు వస్తుంది

"జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చాలా క్రిమినల్ మైండ్ సెట్. బెంగళూరులోనే ఉండి ఎరుకల మహేష్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించారు. ఆ తర్వాత మహేష్ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల ఉదయ్, 20ఏళ్ల సాకి రామాంజనేయులును హత్య చేయించారు. పక్కా ప్లాన్ ప్రకారం వాళ్లను మద్యంలో మత్తుమందు కలిపి మరి హత్య చేయించారు. ఆ కేసు తనకు అంటుకుంటుందని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. ఈనాడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉండి చనిపోయిన కోవిట్ గంగాధర్ రెడ్డి ఈ హత్యలో ప్రధాన పాత్ర వహించారు. తెలుగుదేశం పార్టీ వదిలి రానందుకు పరిటాల రవిని హత్య చేయించారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా పరిటాల రవి హత్య జరగదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డికి వాళ్ల నాన్న మరణం గుర్తుకు వస్తుంది.

వైఎస్ మరణంలో రిలయన్స్ వారి పాత్ర ఉందని చెప్పి ఆయన మనుష్యులతో వాళ్ల ఆస్తులపై దాడులు చేశారు. 2020లో అదే రిలయన్స్ కుటుంబానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీగా చేశారు. 1996లో ప్రజలే చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి మరి ఎందుకు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటు దారుడు అయితే ప్రజలు ఎందుకు గెలిపిస్తారు. వివేకానందా రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి, వాళ్ల కుటుంబం పాత్ర ఉందనడం వాస్తవం కాదా.. వాళ్లను ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి వారించారా? ఇజ్రాయెల్ లో వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆస్తిలో షర్మిలా కు 40శాతం ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత ఆమెతో పాదయాత్ర చేయించి రాజకీయ లబ్ధి పొందాడు. అనంతరం ఆమెను, తల్లి విజయమ్మను ఇంటి నుంచి తరిమేశాడు. ఇది కాదా వెన్నుపోటు రాజకీయం. న్యాయంగా పంచాల్సిన ఆస్తి వాట పంచకుండా సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. వైఎస్సార్ కుటుంబానికి అంత నమ్మకంగా ఉంటున్న సతీష్ రెడ్డిపై హ్యాండ్ గ్రనేడ్ వేసి అతని హత్యకు పథకం రచించ లేదా అనేది సతీష్ రెడ్డే బహిరంగంగా చెప్పాలి" అని సవాల్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News