Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam NEWS 10 hrs ago

శ్చిమ ఆసియా ఉద్రిక్తతలను ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. జరుగుతున్న యుద్ధం ముగించే దిశగా ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు.

ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా వాణిజ్య నౌకాయానానికి తెరవడంపై చర్చలు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో విస్తృత స్థాయి సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత 48 గంటల్లో ఇరాన్‌తో జరిగిన చర్చల్లో కీలక అంశాలపై పురోగతి కనిపించిందని రుబియో పేర్కొన్నారు. త్వరలోనే సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉందని, దీనిపై మరిన్ని వివరాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించే అవకాశముందని తెలిపారు. అయితే చర్చలు ఇంకా తుది దశకు చేరలేదని స్పష్టం చేశారు.

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ప్రధాన విభేదాలుగా ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశాలు ఉన్నాయని సమాచారం. ప్రపంచ ఇంధన సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ జలసంధి మార్గంగానే రవాణా అవుతుంది. ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించడంతో ఆ ప్రాంతంలో నౌకాయానం తీవ్రంగా దెబ్బతింది. ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, వాణిజ్య నౌకాయానానికి అంతరాయాలు కొనసాగుతున్నాయి.

హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గమని, అక్కడ వాణిజ్య నౌకలను అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని రుబియో అన్నారు. గల్ఫ్ ప్రాంత దేశాల సహకారంతో ఒక అవగాహన రూపకల్పనపై చర్చలు జరుగుతున్నాయని, అవి విజయవంతమైతే ఎటువంటి రుసుములు లేకుండా పూర్తిగా తెరిచి ఉన్న జలసంధి పరిస్థితి ఏర్పడవచ్చని చెప్పారు.

ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, సముద్ర మార్గాల్లో సురక్షితమైన, నిర్బంధం లేని వాణిజ్య రవాణా కొనసాగడం భారత్, అమెరికా రెండింటికీ అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తక్కువగా ఉండటం, సరఫరా సులభంగా లభించడం అవసరమని పేర్కొన్నారు.

అమెరికా నుంచి భారత్‌కు ఇంధన దిగుమతులు గణనీయంగా పెరిగాయని జైశంకర్ తెలిపారు. హోర్ముజ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ ఇంధన వనరులను విభిన్న దేశాల నుంచి పొందే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ఇంధన మార్కెట్‌పై ఎలాంటి ఆంక్షలు లేకుండా సరఫరా కొనసాగాలని భారత్ భావిస్తోందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం చేస్తున్న పాకిస్తాన్ గత నెలలో ఇరు దేశాల ఉన్నతాధికారులను ఆహ్వానించి చర్చలు నిర్వహించింది. అయితే అప్పట్లో ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ త్వరలోనే తదుపరి విడత చర్చలను నిర్వహించాలని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రాంతీయ పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, బెహరెన్, పాకిస్తాన్ నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు.

పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ శనివారం రాత్రి వరకు టెహ్రాన్‌లోనే ఉండి ఇరాన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అమెరికా-ఇరాన్ మధ్య తుది ఒప్పందానికి దారితీసే ప్రయత్నాలను వేగవంతం చేయడమే ఈ సమావేశాల లక్ష్యమని పాకిస్తాన్ వర్గాలు వెల్లడించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News