Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

Satyam NEWS 5 days ago

వాడీగూడాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ భవనంలో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం నాలుగో అంతస్తులో మహిళపై నిందితుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు గురైన మహిళను శ్వేతగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ఎవరు, హత్యకు గల కారణాలేమిటి అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News