Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం

మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం

Satyam NEWS 3 weeks ago

విశాఖపట్నం జీవీఎంసీ 95 వార్డు వరలక్ష్మీ నగర్ లో మహిళా మండలి భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు (జనసేన) పాల్గొన్నారు.

పొర్లుపాలెం మాజీ సర్పంచ్ స్వర్గీయ కోన చిన సత్యనారాయణ కొన్నాళ్ల క్రితం నిర్మించిన మహిళా మండలి భవనం శిధిలావ్యవస్థ కావడంతో సుమారు 1.5 లక్షల వ్యయంతో దాన్ని సుందరీకరించారు.

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా వరలక్ష్మి నగర్ కాలనీలో గల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు స్మశాన వాటిక అభివృద్ధి చేయాలని, ఆలయం ఏర్పాటు చేయాలని, మహిళా మండలి భవనం వద్ద జిమ్ ఏర్పాటు చేయాలని, సుదీర్ఘకాలంగా గెజిట్ నోటిఫికేషన్ లేని వరలక్ష్మి నగర్ పేరును నమోదు చేయించాలని రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు వారం రోజుల్లోనే జిమ్ ఏర్పాటు చేయిస్తానని, స్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్చి ఏర్పాటు చేయిస్తానని ఆలయం నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు చైర్మన్ సీనియర్ నాయకులు డైరెక్టర్ మహా కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News