Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

Satyam NEWS 1 week ago

ల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ఘటన చివరకు ఒక భారీ డ్రామాగా తేలింది. కడపకు చెందిన పాస్టర్ అభినయ్‌పై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, వార్తలు అన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారం చిత్రీకరించినవేనని పోలీసులు నిర్ధారించారు.

ఈ కుట్రను అల్లూరి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరిగిన లోతైన దర్యాప్తు ద్వారా ఛేదించారు.

వివరాల్లోకి వెళ్తే, పాస్టర్ అభినయ్ దర్శన్ తన ఆరుగురు అనుచరులతో కలిసి ఈ నాటకానికి తెరలేపారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడమే లక్ష్యంగా, ఒక పథకం ప్రకారం ఎక్కడ దాడి చేయాలి, ఎలా సీన్ క్రియేట్ చేయాలి అనే అంశాలపై వీరు ముందుగానే చర్చించుకున్నారు. ఈ కుట్రకు సంబంధించిన కీలక ఆధారాలు ఒక నిందితుడి భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులకు చిక్కాయి. నిందితుల మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ ఆడియో సందేశాలు, వీడియో కాల్స్, వైద్య నివేదికలను పరిశీలించిన పోలీసులు, ఇది ఆత్మరక్షణ కోసం లేదా సానుభూతి కోసం ఆడిన నాటకమని స్పష్టం చేశారు.

కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారంటూ పాస్టర్ సృష్టించిన దృశ్యాలు పూర్తిగా కల్పితమని దర్యాప్తులో తేలింది. ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. సమాజంలో అశాంతిని కలిగించేలా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి. మంగళవారం రాత్రి విశాఖపట్నంలో పాస్టర్ అభినయ్ దర్శన్‌తో పాటు అతనికి సహకరించిన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం వారిని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News