Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పై వాడికి ఇవ్వాలి. చందాలు ఇవ్వండి.

పై వాడికి ఇవ్వాలి. చందాలు ఇవ్వండి.

Satyam NEWS 3 weeks ago

లూరులో ఓ జిల్లా స్థాయి అధికారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు. ఇందుకు గాను ఆ అధికారికి ఘనమైన వీడ్కోలు పలకాలని జిల్లా స్థాయి లో ఆ శాఖ లో పనిచేసే గ్రామ మండల స్థాయి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

అందు కోసం ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో ఆ శాఖ సిబ్బంది నిధులు సమీకరిస్తున్నట్టు సమాచారం.

ప్రతి గ్రామం నుండి ప్రతి గ్రామ అధికారి 1000 రూపాయలు చొప్పున, ప్రతి మండల కార్యాలయం నుండి 10 వేల రూపాయల చొప్పున ఇప్పటికే నిధుల సమీకరణ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటె మరో పక్క ఆ అధికారి ఉద్యోగ విరమణకు సంబంధించి ఆ శాఖ సిబ్బంది పదవీవిరమణ రోజు సెలవు పేరుతో గైర్హాజరౌతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మరో విశేషం ఏమిటంటే ఆ అధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఆ శాఖ కార్యాలయ పరిధిలో కాకుండా బయట బహిరంగ ప్రదేశం లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి ఆ శాఖ ప్రజా ప్రతినిధి కూడా హాజరు కావడం లేదనేది సమాచారం. ఇప్పటికే కొంతమంది ఆ శాఖ ఉద్యోగులు రెండురోజుల పాటు అంటే ఆ అధికారి ఉద్యోగ విరమణ రోజు కూడా సెలవు కోరుతూ సెలవు దరఖాస్తులు చేస్తున్నారని ఆ శాఖలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ ఇంకో విషయం వినిపిస్తుంది ఆ శాఖ ఛైర్మెన్ కి ఈ అధికారికి మధ్య గత మూడు నెలలుగా ప్రజా ప్రతినిధి పెట్టమన్న బిల్లులు పెట్టక పోవడం వల్ల వారి మధ్య కో ఆర్డినేషన్ కొరవడిననట్టు సమాచారం. నిజంగా ఆ ప్రజా ప్రతినిధి పెట్టమన్న బిల్లులు పెట్టి ఉంటే ఆ అధికారి ఉద్యోగ విరమణ తరువాత కోర్ట్ మెట్లెక్కాల్సి వస్తుందనే భయం తో ఆ జిల్లా అధికారి బిల్లులు పెట్టక పోవడం తో ఆ అధికారి ఉద్యోగ విరమణ అంతా ప్రయివేటు గా నిర్వహించుకోవాల్సి వస్తుందని కొంత మంది ఉద్యోగులు గుస గుస లాడుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News