Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేరెంట్ టీచర్ మీటింగ్ కు తాగి వచ్చిన హెడ్ మాస్టర్?

పేరెంట్ టీచర్ మీటింగ్ కు తాగి వచ్చిన హెడ్ మాస్టర్?

Satyam NEWS 1 day ago

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఒక అపశృతి దొర్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) సందర్భంగా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది.

చింతపల్లి మండలం పినపాడు గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ప్రధానోపాధ్యాయుడు కె.వి. రమణ మద్యం మత్తులో హాజరయ్యారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వాట్సాప్‌తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

స్థానికుల కథనం ప్రకారం, మెగా పీటీఎం నిర్వహించాల్సిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు సరిగా మాట్లాడలేకపోయారని, సమావేశాన్ని నిర్వహించడంలో విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో ఆయన టేబుల్ లేదా బెంచిపై పడిపోయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఓ విద్యార్థి ప్రధానోపాధ్యాయుడిని సరిచేస్తూ నిలబెట్టే ప్రయత్నం చేసిన దృశ్యాలు వైరల్ కావడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశమైంది.

ఈ పరిణామంతో సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక సమావేశానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రధానోపాధ్యాయుడు ఇలాంటి పరిస్థితిలో రావడం బాధాకరమని వారు అభిప్రాయపడ్డారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని, తప్పు నిర్ధారణ అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వివాదం నెలకొనడంతో అనంతరం సీఆర్పీ రాము ఆధ్వర్యంలో పేరెంట్స్-టీచర్స్ సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులతో సమావేశాన్ని కొనసాగించి పాఠశాల విద్యా అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో ఉన్నారనే విషయం ప్రస్తుతం ఆరోపణ మాత్రమే. దీనిపై విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆరోపణలపై విచారణ నిర్వహించిన తర్వాతే వాస్తవ పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ స్పందనతో పాటు అధికారిక దర్యాప్తు నివేదిక కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News