Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

Satyam NEWS 2 weeks ago

త్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపటితో సాకారం కాబోతోందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పాయకరావుపేటలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను రేపు విడుదల చేయనున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని మంత్రి పార్థసారథి పరిశీలించారు.

కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఐదు శతాబ్దాలుగా ఉన్న కల నెరవేరబోతున్న రోజు ఇదని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోలవరం కాలువ పనులను ఆపకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం జలహారతి కార్యక్రమం ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తున్నారని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ప్రజలను, రైతులను మోసం చేసిందని మంత్రి విమర్శించారు. బోగస్ కంపెనీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ఆరోపించారు. విజన్ ఉన్న నాయకుడికి, విజన్ లేని నాయకుడికి ఉన్న తేడా ఇదేనని పార్థసారథి వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ పాలనలో ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించలేదని మంత్రి విమర్శించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల్లో మార్కులు మార్చి తల్లిదండ్రులకు చూపించినట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేయాలని, వారికి మేలు చేయాలని చంద్రబాబుకు తపన ఉందని అన్నారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేయడం వల్ల సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతం సస్యశ్యామలం కానుందని, రైతుల ముఖాల్లో ఆనందం కనిపించనుందని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కూడా ఈ జలాల విడుదలతో కొంత ఊరట లభిస్తుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాల విడుదల ఉత్తరాంధ్ర వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News