Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధాని మోడీ పర్వటనకు ముస్తాబవుతున్న భోగాపురం ఏర్ పోర్ట్

ప్రధాని మోడీ పర్వటనకు ముస్తాబవుతున్న భోగాపురం ఏర్ పోర్ట్

Satyam NEWS 2 days ago

త్తరాంధ్ర తలమానికం కానున్న, పారిశ్రామిక హబ్ గా రూపుదిద్దుకోబోతున్న మూడు జిల్లాల అభివృద్ధికి మూలమైన భోగాపురం లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ను వచ్చే నెల 1వ తేదీన ప్రధాని మోడీ ప్రారంభించనున్న సంగతి విదితమే.

ఇందుకోసం ఏపీ రాష్ట్ర ఉన్నతాధికారులు గడచిన మూడు రోజుల నుంచీ భోగాపురం లోనే ఉంటూ ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణబాబు, వీర పాండ్యన్ లతో పాటు గురువారం విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపీ నాధ్ జెట్టి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉత్తరాంధ్ర పార్టీ అధ్యక్షులతో కూడా పరిశీలించారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కార్యక్రమం నోడల్ ఆఫీసర్ ఎం.టి.కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ ఏఆర్ దామోదర్, జేసి సేధు మాధవన్ లు సంయక్తంగా ట్రంపెట్ బ్రిడ్జి, ప్రధాన అనుసంధాన రహదారులు, బహిరంగ సభా వేదిక తదితర ప్రాంతాల పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని జిఎంఆర్ సిబ్బంది ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News