Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి మృతి.. కుటుంబ సభ్యుల ఎదురు చూపులు

సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి మృతి.. కుటుంబ సభ్యుల ఎదురు చూపులు

Satyam NEWS 5 years ago

అమెరికాలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి మృతి చెందాడు. మృతదేహం కోసం కుటుంబసభ్యుల ఎదురు చూస్తున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 27న అనారోగ్యంతో న్యూయార్క్ సిటీ బాఫెల్లో లో బోడుప్పల్ మేడిపల్లి కి చెందిన సాఫ్ట్‌వేర్ శ్రీధర్ పానుగంటి చనిపోయాడు.

అమెరికాలో తెలిసిన వారు ఎవరు లేకపోవటం అక్కడి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవటంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం ఆఖరి చూపుకైనా నోచుకోలేక పోతున్నామే అనే బాధలో కుటుంబ సభ్యులున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమెరికా అధికారులతో సంప్రదించి శ్రీధర్ మృతదేహం త్వరగా వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.

మృతుడికి భార్య, అయిదేళ్ల బాబు మేడిపల్లిలోనే ఉన్నారు. దయచేసి అధికారులు ఎవరైనా సహాయం చేయాలని తమ ఫోన్ నెం. కవిత 9182631204 శ్రీ సాయి ఎన్ క్లేవ్ రోడ్ నెం.2 ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ మేడిపల్లి బోడుప్పల్ హైదరాబాద్‌లో ఉంటున్నట్లుగా బాధితులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News