Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైల మహా క్షేత్రంలో 11 నుంచి దసరా మహోత్సవాలు

శ్రీశైల మహా క్షేత్రంలో 11 నుంచి దసరా మహోత్సవాలు

Satyam NEWS 1 week ago

శ్రీశైలమహాక్షేత్రములో ఈ నెల 11 నుండి 20 తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించబడుతున్నట్లు దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు తెలియజేశారు.

శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.

వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటారు. లోక క్షేమం కోసం సహస్ర చండీపారాయణ సహిత శతచండీ మహారుద్రయాగం ఉంటాయి. అదే విధంగా 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News