Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

Satyam NEWS 1 week ago

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు.

ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు.

ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు.

అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News