Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం చంద్రబాబును కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

సీఎం చంద్రబాబును కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Satyam NEWS 21 hrs ago

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ కలిశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, సేవా-సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా-సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టాల్సిన వివిధ సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. సేవా-సంకల్ప్ అభియాన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News