Dailyhunt
వార్డు సచివాలయం తనిఖీ

వార్డు సచివాలయం తనిఖీ

Satyam NEWS 5 years ago

ఏపీలోని మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ఊరైన విజయనగరం నగరంలోని దాసన్నపేటలో 6వ నెంబరు వార్డు సచివాల యాన్నిఆ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తనిఖీ చేశారు. ముందుగా అక్కడి రికార్డులను, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ బోర్డులను ఏర్పాటు చేసిందీ, లేనిదీ గమనించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును, పెండింగ్ దరఖాస్తులను, పింఛన్‌, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపైన ఆరా తీశారు. సచివాలయ వ్యవస్థను అమలును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదనీ, దానికి తగ్గట్టుగా పనిచేయాలని సిబ్బందిని డిఆర్ఓ గణపతిరావు కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News