Saturday, 11 Jul, 4.24 pm SMTV 24x7 NEWS

వ్యాపారం
ఏకంగా 9 శాతం వడ్డీని అందిస్తున్న బ్యాంకులు!!!

చేతిలో డబ్బులు ఎక్కడైనా ఇన్వె్స్ట్ చేయాలని భావిస్తున్నారా? అది కూడా రిస్క్ లేకుండా ఆకర్షణీయ రాబడి పొందాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు దిగ్గజ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఏకంగా 9 శాతం వడ్డీని ఇస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ప్రముఖ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల కన్నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ లభిస్తోంది. వీటిల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన బ్యాంకులో ఎఫ్‌డీలపై 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. 7 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం, 45 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 181 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై 6.5 శాతం, ఏడాది నుంచి 699 రోజుల ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. 700 రోజుల ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఆపైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీ పొందొచ్చు. సన్‌రైజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇక ఆటుపైన ఎఫ్‌డీలపై 9 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐదేళ్ల ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేటు లభిస్తుంది. ఇక నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SMTV Telugu
Top