Friday, 27 Nov, 9.20 pm SMTV 24x7 NEWS

తాజా వార్తలు
కేసీఆర్ కి ఎన్నికలప్పుడు మాత్రమే కుల సంఘాలు గుర్తుకు వస్తాయి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల సంఘాల భవనాలు నిర్మిస్తామని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారు అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎన్ని కుల సంఘాలు భవనాలు నిర్మించారో చెప్పాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎన్నికలప్పుడు మాత్రమే కుల సంఘాలు గుర్తుకు వస్తాయి అని ఘాటు విమర్శలు చేశారు. కులాల పేరుతో, వర్గాలతో చీల్చే ప్రయత్నం చేయకుండా అందరూ ధర్మాన కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారు బండి సంజయ్. అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ను గెలిపిస్తే ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక తెరాస ప్రభుత్వం మరొకసారి అధికారం లోకి వస్తే బీ ఆర్ ఎస్ తెస్తారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెరాస పోవాలి అంటే బీజేపీ కి ఓటేయాలని బండి సంజయ్ అన్నారు. అంతేకాక గత ఎన్నికల్లో హైదరాబాద్ ను డల్లాస్ చేస్తామని కేసీఆర్ చెప్పారు, చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు. వర్షాలకు పేదలు తడుస్తుంటే, సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయల తో ప్రగతి భవన్ కట్టుకున్నారు అని అన్నారు. అంతేకాక ఈ నెల 28 న కేసీఆర్ చెప్పే పిట్టకథలు నమ్మితే మరొకసారి మోసపోతారు అంటూ బండి సంజయ్ ప్రజలకు సూచించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SMTV Telugu
Top