Thursday, 29 Jul, 12.23 pm SMTV 24x7 NEWS

వ్యాపారం
సిలిండర్ బుకింగ్‌పై అదిరే ఆఫర్

గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని భావించే వారికి ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు ఆఫర్ చేస్తోంది. రూ.250 విలువైన అమెజాన్ పే గిఫ్ట్ కార్డును సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ ఐ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్ సహా ఇతర బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్ ఉంది. ఈ నెల చివరి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. మూడు బిల్లు చెల్లింపులు చేసిన వారికి అమెజాన్ పే గిఫ్ట్ కార్డు పొందే ఛాన్స్ ఉంటుంది. ప్రతి రోజూ 3 బిల్లు చెల్లించే తొలి 300 మందికి మాత్రమే వోచర్ పొందేందుకు అర్హత ఉంటుంది. ఒక కస్టమర్‌కు ఒక వోచర్ మాత్రమే వస్తుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SMTV Telugu
Top