Friday, 27 Nov, 5.20 pm SMTV 24x7 NEWS

తాజా వార్తలు
టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కూకట్ పల్లిలో ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో పాల్గొనగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రోడ్ షోలో పాల్గొంటోన్న రాజాసింగ్ వాహనం వద్ద బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలను ఆయా పార్టీల నాయకులు సముదాయించారు. దీంతో రాజాసింగ్ తన వాహనంలో రోడ్ షోను కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: SMTV Telugu
Top