Friday, 13 Jul, 2.13 am సోషల్ పోస్ట్

అన్టోల్డ్
మన ఊరు - మన చరిత్ర..!

కొండపర్తి

కొండపర్తి గ్రామం , ఐనవోలు మండలం , వరంగల్ అర్బన్ జిల్లా.

ఎక్కడ ఉంది ?

హన్మకొండ నుండి కాజీపేట వెళ్లే దారిలో కాజీపేట దర్గా పక్కనుండి 3కిలోమీటర్లు ప్రయాణిస్తే కొండపర్తి గ్రామం వస్తుంది. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పేరెలా వచ్చింది ?
రెండు కొండల మధ్య ఉన్న గ్రామం కాబట్టి కొండపర్తి అనే పేరు వచ్చింది.

2011 జనాభా లెక్కల ప్రకారం
జనాభా -6439.
పురుషులు -3222.
మహిళలు -3217
ఇండ్లు -1633
పిన్ కోడ్ - 506003

వరంగల్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం.
కాకతీయుల కాలం లో సైనిక కేంద్రం గా వెలుగొందిన ప్రాంతం . .
కాకతీయ మహా సామ్రాజ్యానికి మంత్రి ని, సైన్యాధ్యక్షులను అందించిన ఊరు. .
నిత్యం ఆలయాలలో ధూప దీప నైవేద్యాలతో, పూజాధికాలతో ఉన్న ప్రాంతం. .
850 సంవత్సరాల క్రితం నిత్యం సైనిక దళాల కవాతులతో దద్దరిల్లిన నేల. .
సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి సామంత సేన గా వర్ధిల్లి వేల సంఖ్యలో సైనికులను అందించిన ప్రాంతం. .
అబ్బుర పరిచే శిల్ప కళా నైపుణ్యం, అద్భుత కట్టడాలతో అలరారిన పుణ్య భూమి .
ఒకప్పుడు కొండపర్తి పేరు చెబితే వెన్నులో వణుకు పుట్టేదట. .
తెలంగాణాకే తలమానికం అయిన శిల్ప సంపద ఈ గ్రామ సొంతం. .

కాకతీయ సామ్రాజ్య చరిత్ర పరంగా చూస్తే కొండపర్తి కి ఘనమైన చారిత్రాక వారసత్వం ఉందీ. .

కొండ పర్తి గ్రామం కాకతీయుల కాలంలో కొండపర్తి నగరంగా పేరు గాంచింది. మాల్యాల రాజ వంశ సామంత రాజుల ముఖ్య కేంద్రంగా ఉండేది. .

కాకతీయ చక్రవర్తి అయిన రుద్రదేవుడికి మంత్రిగా పనిచేసిన కాటమసేనానిది ఈ ఊరే.ఇతని రెండవ కొడుకైన చౌండసేనాని కూడా గణపతి దేవుని వద్ద సైన్యాధ్యక్షునిగా పనిచేశాడు. .

కాకతీయ రుద్ర దేవుడు ఆంధ్ర దేశపు కోస్తా ప్రాంతం పైన దండెత్తగా కాటయ సేనాని .
ఆ కోటల ముట్టడిలో అత్యంత కీలక పాత్ర వహించాడు. కాటయ సేనాని ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తింపు గా రుద్ర దేవుడు అతనికి కోట గెలపాట (కోటని జయించిన వాడు అని అర్ధం ). .
తరువాత కాలంలో అతను మంత్రిగా కూడా పనిచేశాడు. .
కాటమ సేనానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో మొదటివాడు ప్రోల , రెండవ వాడు చౌoడ సేనాని. .

చౌండసేనాని: రుద్రదేవుడి వద్ద మంత్రిగా పనిచేసిన కాటమసేనాని రెండవ కొడుకే ఈ చౌండసేనాని .

గణపతి దేవుడి పరిపాలనా కాలంలోని తొలి రోజుల్లో చౌoడ సేనాని సర్వ సైన్యాధ్యక్షుడిగా పని చేశాడు. .
1203 - 1206 సంవత్సరాల మధ్య కాలంలో గణపతి దేవుడు ఆంధ్ర ప్రాంత వెలనాటి పృద్విశ్వరుడి పైకి చౌoడ సేనాని ఆధ్వర్యంలో భారీ సైన్యాన్ని పంపాడు. .
మొదట కాకతీయ సైన్యాలు చందవోలు పైన దండెత్తగా తప్పించుకోవడానికి ఒక ద్విపానికి వెళ్ళాడు. కాకతీయ సైన్యాలు ఆ ద్విపాన్ని సైతం స్వాధీనం చేసుకుని పృద్విశ్వరుడిని ఓడించి ఖజానా ని కొల్లగొట్టి గణపతి దేవుడికి సమర్పించారు. .
దాంతో గణపతి దేవుడు ఆనందం తో దివి చురాకర , దివి లుంటాక (దివిని కొల్లగొట్టినవాడు అని అర్ధం ) అనే బిరుదును అందజేసి సత్కరించారు. .
ఆ విజయానికి గుర్తుగా ఇతడు కాకతీయ పాలనా సూత్రం .
(Triple T ) .
T- Tank .
T- Town .
T-Temple .
ప్రకారం కొండపర్తి గ్రామంలో తన పేర చౌండ సముద్రం అనే పెద్ద చెరువుని తవ్వించి దానితో పాటు తన స్వగ్రామం ఐన కొండపర్తిలో ఆలయం నిర్మింపజేశాడు .

ఇక నిర్మాణాల పరంగా చూస్తే కొండపర్తి గ్రామంలో గల ఆలయాలు ,నిర్మాణాలు ఇవి. .
1. త్రికుటాలయం .
2. సురాభాండేశ్వరాలయం .
3.500 స్తంభాల దేవాలయం .
4.విష్ణు ఆలయం .
5.బురుజులు .
6.నేలబొయ్యారం .
7.చెరువు .
8.శాసనాలు . .

త్రికుటాలయం : .

చౌoడసేనాని కొండపర్తి గ్రామం లో చౌండ్యేశ్వరాలయం పేరుతో ఒక త్రికుటాలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు. .

గతంలో ఆలయాన్ని నిర్మించిన వారి పేరునే ఆలయాలకు పెట్టేవారు. .

ఉదాహరణకు వరంగల్లు వేయిస్తంభాల గుడిలో రుద్రదేవ మహారాజు ప్రతిష్టించిన ఈశ్వరుడు రుద్రేశ్వరుడుగా , బేతరాజు ప్రతిష్టించిన ఈశ్వరుడు బేతేశ్వరుడుగా, పిల్లల మర్రిలో ఎఱకసానమ్మ ప్రతిష్టించిన దేవుడు ఎఱకేశ్వరుడుగా, రేచర్ల రుద్రసేనాని కట్టించిన ఆలయం రుద్రేశ్వరాలయంగా( తర్వాతి కాలంలో రామప్ప గుడి), చౌండసేనాని కట్టించినది చౌండేశ్వరాలయంగా (కొండపర్తి శివాలయం) పిలవబడ్డాయి. .

ఈ ఆలయం ముందు ఉన్న శాసనంలో ఉన్న వివరాల ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తి అయిన రోజు అనగా క్రీ.శ 1125 రుదిరోద్గారి నామ సంవత్సరం వైశాఖమాసం శుక్లపక్షం April 17 th నాడు ఆలయంలో శివలింగాన్ని , విష్ణు మూర్తి ని , ప్రోలేశ్వరుడిని ప్రతిష్టించాడు. .
ఆ ఆలయ ధూప దీపనైవేధ్యాల కోసం చౌండ్యపురం అనే అగ్రహారాన్ని , నారుకుర్కి అనే గ్రామాన్ని దానమిచ్చాడు. శాసనం ప్రకారం ప్రస్తుతం ఆలయం నిర్మించి 814 సంవత్సరాలు అయింది. .

2 సంవత్సరాల క్రితం పురావస్తు శాఖ వారు ఆలయ పునరుద్ధరణ పేరుతో ఆలయాన్ని విప్పి ,స్తంభాలను శిల్పాలను కుప్పగా పోశారు. .

ఆలయం పునాదిగా ఉపయోగించిన ఇసుక మాత్రం ఉంది. .

ఈ ఆలయాన్ని కూడా ఇసుక పెట్టే పరిజ్ఙానం (sand box technology) అనే విధానం ప్రకారం నిర్మించారు. .
ప్రస్తుతం ఆలయం లేదు కానీ " ప్రాచీన స్మారక చిహ్నాలే మన పూర్వీకులు మనకు ఇచ్చిన సంపద .వాటిని మనం కాపాడుకోవాలి." అని పురావస్తు శాఖ వారి బోర్డ్ మాత్రం ఉంది. .

ఆ పక్కనే రెండు నంది విగ్రహాలు మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి.ఆ పక్కనే చౌండసేనాని వేయించిన ఒక శాసనం , గణపతి దేవుడి కాలం నాటి మరో శాసనం,ఆంజనేయస్వామి విగ్రహం,భైరవమూర్తి ,తదితర శిల్పాలుఉన్నాయి.మిగిలిన వాటిని గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ముందు, స్కూల్ ఆవరణలో ఉంచారు.వాటికి రక్షణ లేకపోవడంతో అవి అపహారణకి గురవుతున్నాయి.గత ఏడాది అందులో ఉన్న దాదాపు 5 అడుగుల వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. .
2 సంవత్సరాల క్రితం విప్పిన ఆలయాన్ని పునరుద్దరించడంలో పురావస్తు శాఖ ఇంతవరకూ ఒక్క రాయిని కూడా అటునుంచి తీసి ఇటు పెట్టలేదు ,పనులు కూడా కనీసం ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. .

సురాభాండేశ్వర ఆలయం: .
కొండపర్తి గ్రామ పంచాయితీ పక్కనుంచి వెళ్తే కుడివైపు ఉంటుందీ ఆలయం.. .
ఆలయ ప్రవేశంలో రెండువైపులా ద్వారపాలక విగ్రహాలు మనల్ని ఆలయంలోకి ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి. .

లోపలికి ప్రవేశించగానే వివిధ రకాల పరిమాణాల్లో 3 నందులు ఉన్నాయి. .

ఇందులో రెండు కాకతీయ శైలిలో ఉండగా మరోటి చాళుక్య శైలిలో ఉంది.ఇదే ఆలయంలో దాదాపు10 సంవత్సరాల క్రితం ఒక రాతి ద్వజ స్తంభం ఉండేదని చెప్తారు. .

ఆ స్తంభంపై భైరవమూర్తి ప్రతిమ చెక్కి ఉండేదట. .

ప్రస్తుతం అది లేదు.ఆలయ ప్రవేశంలో నల్లరాతితో చెక్కిన 3 అడుగుల గణపతి విగ్రహం ఉంది.అంతరాలయంలో .
శివలింగం పైన ఉన్న పైకప్పుని చూస్తే ఆశ్చరపోకమానం.అనేక సూక్ష్మరాతి విగ్రహాలు చెక్కి ఉన్నాయి.ఇంత సూక్ష్మ విగ్రహాలు,ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ తప్పితే మనం ఇంకేక్కడా చూడలేం. .

ఆలయం శివలింగం పై భాగంలో ఉన్న కప్పు పైన గుర్రం పైన కూర్చుని ఉన్న ఒక యుద్ధ వీరుడి విగ్రహం కన్పిస్తుంది. ఈ విగ్రహం చౌoడ సేనానిది. విగ్రహాన్ని చూస్తే అతను ఎంత పరాక్రమ వంతుడో అర్ధం అవుతుంది. .

500 స్తంభాల ఆలయం : కొండ పర్తి గ్రామంలో ఉన్న మరొక ఆలయం 500 స్తంభాల ఆలయం . ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేయబడిన ఆలయం .హనుమ కొండ లో ఉన్న వేయి స్తంభాల ఆలయం గురించి చాలా మంది కి తెలిసినప్పటికీ ఈ ఆలయం గురించి తెలియదు. ఇలాంటి ఆలయాలు జనగామ జిల్లా నిడిగొండ , సిద్దిపేట జిల్లా నంగునూరు , కరీంనగర్ జిల్లా లోని ఉప్పరపల్లి లో ఉన్నాయి. .

ప్రస్తుతం ఆలయం పూర్తిగా ధ్వంసం అయి శిథిలావస్థలో ఉంది. .

విష్ణు ఆలయం : గ్రామం లోని కోట బురుజులకు సమీపంలో ఉన్న ఈ ఆలయం 16 స్తంభాలతో కాకతీయ శైలిలో నిర్మాణం చేయబడింది. అంతరాలయం , గర్భగుడి ని కలిగి ఉంది. లోపల ఎటువంటి విగ్రహం లేదు. ఈ ఆలయం కూడా ప్రస్తుతం ఎవరి పట్టింపు లేక నిరాదరణ కు గురయింది. .

వేణు గోపాల స్వామి దేవాలయం. : .

గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆలయం ఇది. ఆలయం లో వేణుగోపాల స్వామి విగ్రహం తో పాటు నల్లరాతితో చెక్కిన .

అనంత పద్మనాభ స్వామి విగ్రహం , గరుడ , ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి. .

బురుజులు: ఒకప్పుడు సైనికులు పహారా కాయడానికి ఉపయోగపడ్ద బురుజులు నేడు శిధిలావస్తలో కూలడానికి సిద్దంగా ఉన్నాయి.. .
ఊరికి నాలుగువైపులా బురుజులు,వాటికింది నుండి రహస్య సొరంగ మార్గం ఉన్నాయి..వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే ఉన్న రెండస్తుల బురుజు కొండపర్తి గ్రామానికే ప్రత్యేక ఆకర్షణ.దాని కింద నేలబొయ్యారం ఆనవాళ్లను మనం నేటికీ చూడోచ్చు. .
శాసనాలు .

కొండపర్తి గ్రామంలో వివిధ కాలాలకు చెందిన మూడు రాతి శాసనాలు లభించాయి. వాటిలో రాయబడిన వివరాల ఆధారంగా మనకు కొండపర్తి చరిత్ర తెలుస్తుంది. .
1. క్రి. శ 9 వ శతాబ్దం నాటి ప్రాచీన తెలుగు లిపిలో రాయబడ్డ శాసనం ఊరి చివర చెరువు పక్కన ఉన్న గుట్ట మీద స్థానికులు "కొక్కెర గుండు" అని పిలిచే ఒక పెద్ద రాతి బండకి చెక్కబడి ఉంది. .

ఆ శాసనం ప్రకారం: .

పొలమెయరట్టోడి (కాకతీయుల కాలంలో గ్రామాధికారిని ఇలా పిలిచేవారు) అనే స్థానికాధికారి మంచికాళు కొడుకైన కొణ్డపకు భూమి కౌలు కి ఇచ్చి పండిన పంటలో సగం పంచుకొనే విధంగా నిర్ణయం జరిగింది. .
తాంబూలము తీసుకుని యిచ్చిన భూమి. ఇది దానము కాదు.ఒక కట్టడి. .

అంటే అలా నిర్ణయం జరిగిన సందర్భంలో పెద్దమనుషుల చేతను , సాక్షుల చేతను .
తాంబూల స్వీకరింపజేశారు. .
ప్రస్తుతం ఈ రకమైన తాంబూల ధారణ మనం పెళ్లి సమయం లో చూడవచ్చు. .

2.గణపతిదేవ చక్రవర్తి ముఖ్య సేనాని యైన చౌండ సేనాని తాను నిర్మించిన చౌండ సముద్రం (వరంగల్ జిల్లాలోని కొండపర్తి చెరువు) వద్ధ వేయించిన శాసనంలో చేసిన విజ్ఞప్తి .

"ఈ ధర్మసేతువు నృపులందరికీ ఒకేరకమైనది కాబట్టి మీతో సదా రక్షించబడాలనీ, భవిష్యత్ కాలాలలో వచ్చే రాజులందరినీ ప్రార్ధిస్తున్నాను. నావంశంవారుగానీ, ఇతరులుగానీ ఇకముందు ప్రభువులైనపుడు ఈ విధానాన్ని దోషరహిత మనస్కులై రక్షింతురుగాక, అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. .

ధర్మం శత్రువు-చేసినా సరే కష్టపడి రక్షించాలి. శత్రువు శత్రువేకానీ ధర్మం ఎవరికీ శత్రువు కాదు" .

సమాజ సంపదలైన ప్రకృతి వనరుల రక్షణపై కాకతీయులకు ఉన్న అభిప్రాయం మనకు ఈ శాసనం ద్వారా వెల్లడి అవుతుంది. .

3. మూడవ శాసనం శక సంవత్సరం 1162 (క్రి. శ 1242 ) లో అంతకు ముందు నిర్మాణం చేసి ఉన్న ప్రోలేశ్వర ఆలయం లో రుద్రేశ్వర , కేశవ మూర్తులను ప్రతిష్టాపన చేసి ఆలయానికి ప్రాకారాన్ని నిర్మాణం చేసినట్లు రాయబడింది. .
మూడవ శాసనం సంస్కృత పద్యములలో శక సంవత్సరం 1125 (క్రి. శ 1203 )లో వేయబడింది. .
ఈ శాసనం లో మాల్యాల వంశం వారి వివరాలతో పాటు కాకతీయుల శిల్పుల నైపుణ్యత శిల్ప నిర్మాణ సామర్థ్యాన్ని ,సమగ్రత ను గూర్చి గణపతిదేవుని కాలంనాటి కొండపర్తి శాసనం కింది శ్లోకంలో వర్ణించింది. .
ప్రాకారోజయతి త్రికూటమ్ అభితస్తల్ తేన నిర్మాపితఃసుశ్లిష్టైః క్రమశీర్షకై రుపచితో నీలోపలైః కల్పితఃయశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకశిలా తక్షకైఃసంతక్ష్యేవ మహీయ సీమ్ ఇవ శిలాం యత్నాత్ సముత్తారితః .
భావం : .
నల్లని రాళ్లను సమానంగా నున్నగా చెక్కి,సన్నిహితంగా కూర్చి నిర్మించినత్రికూట ప్రాకారం విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలానిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహా ప్రయత్నంతో శిల్పులు నిర్మించారు. .
కాకతీయ దేవాలయాల శిల్పుల నైపుణ్యం ఇటువంటి సమగ్రతను సంతరించుకుంది. .

ఇతర చారిత్రక ఆధారాలు : .

గ్రామం లోని ఊర చెరువుకు ఈశాన్యముగా ఉన్న గుట్ట పై ఉన్న సమతల ప్రదేశం లో నవీన శిలా యుగం నాటి మానవుడు తన రాతి పనుముట్లను పదును పెట్టుకోవడం కోసం రాతి పై నూరిన గుర్తులు కనపడతాయి. .
గ్రామ సరిహద్దు లో తులసీమయ్య గడ్డ అనే ప్రాంతంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు ఆ యుగం నాటి మానవుల మనుగడని గుర్తు చేస్తున్నాయి. .
గ్రామం లో వివిధ ప్రాంతాలలో లభించిన విగ్రహాలను , వాటి శిల్ప రీతులను బట్టి గ్రామం రాష్టకూట , చాళుక్య , కాకతీయుల కాలం నాటి రాజ వంశాల పరిపాలనలో ఉన్నట్లు చెప్పవచ్చు. .

చెరువులు : .

ఆనాడు అయినా ఈనాడు అయినా ప్రజలకు, ప్రభుత్వానికి వ్యవసాయం ముఖ్య ఆదాయ మార్గం. కాబట్టి కాకతీయ రాజులు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. .
వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వారి పరిపాలనా కాలం లో కాకతీయ రాజులే కాక వారి సేనానులు, సామంతులు, ఉద్యోగులు, మతాచార్యులు, సంపన్నులు తటాకాలు నిర్మించడంపై అమిత శ్రద్ధ చూపారు. .
ప్రకతి సిద్ధంగా వర్షపు రూపంలో వచ్చేనీటిని నిల్వ చేసుకునే లక్ష్యంలో కాకతీయుల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఆ నిర్మాణాల్లో భాగంగా .

కొండ పర్తి గ్రామంలో రెండు చెరువుల నిర్మాణం జరిగింది. .

ఒకటి 1000 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్న చౌoడసముద్రం కాగా మరొకటి ఊర చెరువు. ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయానికి ఈ రెండు చెరువుల నీరే ఆధారం. .

కొండపర్తి గ్రామం లో ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లు , చారిత్రాక కట్టడాలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన వరంగల్ కి అతి సమీపంలో మా ఊరు ఉంది. కాబట్టి గ్రామంలోని ఆలయాలను ప్రభుత్వం పునరుద్ధరించి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.గ్రామానికి గత వైభవాన్ని పునరుద్దరించాలి .
మారుపాటి శ్రీనివాస్ రెడ్డి ( గ్రామస్తుడు ) .

గతంలో పి.వి రంగారావు పురావస్తు శాఖ మంత్రి గా పనిచేసినప్పుడు కొండపర్తి గ్రామాన్ని సందర్శించి గ్రామంలొనే ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం గ్రామములో వివిధ ప్రాంతాల్లో ఉన్న 150 కి పైగా విగ్రహాలను , శిల్పాలని సేకరించి త్రికుటాలయం ఎదురుగా పెట్టారు. మ్యూజియం ప్రతిపాదన అటకెక్కింది. కొన్ని శిల్పాలను హైదరాబాద్ , వరంగల్ మ్యూజియాలకు తరలించారు. గత ఏడాది ఒక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. .
కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామ చారిత్రాక విశిష్టత ని కాపాడాలి. .
సోమయ్య (మాజీ సర్పంచ్ ) .

https://photos.google.com/share/AF1QipP0sw9Ba1m9kFNyOHrPtst6XXwMPCe8CWfahirRL46hz-yJME8XPC7Q_z6jd9T39w?key=TTN4UkRHOTBsenRwbzJLajlIQl9GM0dwU2xHbjB3 .

కాకతీయ మహా సామ్రాజ్యానికి మంత్రి ని, సైన్యాధ్యక్షులను అందించిన ఊరు.
నిత్యం ఆలయాలలో ధూప దీప నైవేద్యాలతో, పూజాధికాలతో ఉన్న ప్రాంతం.
850 సంవత్సరాల క్రితం నిత్యం సైనిక దళాల కవాతులతో దద్దరిల్లిన నేల.
సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి సామంత సేన గా వర్ధిల్లి వేల సంఖ్యలో సైనికులను అందించిన ప్రాంతం.
అబ్బుర పరిచే శిల్ప కళా నైపుణ్యం, అద్భుత కట్టడాలతో అలరారిన పుణ్య భూమి
ఒకప్పుడు కొండపర్తి పేరు చెబితే వెన్నులో వణుకు పుట్టేదట.
తెలంగాణాకే తలమానికం అయిన శిల్ప సంపద ఈ గ్రామ సొంతం.

కాకతీయ సామ్రాజ్య చరిత్ర పరంగా చూస్తే కొండపర్తి కి ఘనమైన చారిత్రాక వారసత్వం ఉందీ.

కొండ పర్తి గ్రామం కాకతీయుల కాలంలో కొండపర్తి నగరంగా పేరు గాంచింది. మాల్యాల రాజ వంశ సామంత రాజుల ముఖ్య కేంద్రంగా ఉండేది.

కాకతీయ చక్రవర్తి అయిన రుద్రదేవుడికి మంత్రిగా పనిచేసిన కాటమసేనానిది ఈ ఊరే.ఇతని రెండవ కొడుకైన చౌండసేనాని కూడా గణపతి దేవుని వద్ద సైన్యాధ్యక్షునిగా పనిచేశాడు.

కాకతీయ రుద్ర దేవుడు ఆంధ్ర దేశపు కోస్తా ప్రాంతం పైన దండెత్తగా కాటయ సేనాని
ఆ కోటల ముట్టడిలో అత్యంత కీలక పాత్ర వహించాడు. కాటయ సేనాని ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తింపు గా రుద్ర దేవుడు అతనికి కోట గెలపాట (కోటని జయించిన వాడు అని అర్ధం ).
తరువాత కాలంలో అతను మంత్రిగా కూడా పనిచేశాడు.
కాటమ సేనానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో మొదటివాడు ప్రోల , రెండవ వాడు చౌoడ సేనాని.

చౌండసేనాని: రుద్రదేవుడి వద్ద మంత్రిగా పనిచేసిన కాటమసేనాని రెండవ కొడుకే ఈ చౌండసేనాని

గణపతి దేవుడి పరిపాలనా కాలంలోని తొలి రోజుల్లో చౌoడ సేనాని సర్వ సైన్యాధ్యక్షుడిగా పని చేశాడు.
1203 - 1206 సంవత్సరాల మధ్య కాలంలో గణపతి దేవుడు ఆంధ్ర ప్రాంత వెలనాటి పృద్విశ్వరుడి పైకి చౌoడ సేనాని ఆధ్వర్యంలో భారీ సైన్యాన్ని పంపాడు.
మొదట కాకతీయ సైన్యాలు చందవోలు పైన దండెత్తగా తప్పించుకోవడానికి ఒక ద్విపానికి వెళ్ళాడు. కాకతీయ సైన్యాలు ఆ ద్విపాన్ని సైతం స్వాధీనం చేసుకుని పృద్విశ్వరుడిని ఓడించి ఖజానా ని కొల్లగొట్టి గణపతి దేవుడికి సమర్పించారు.
దాంతో గణపతి దేవుడు ఆనందం తో దివి చురాకర , దివి లుంటాక (దివిని కొల్లగొట్టినవాడు అని అర్ధం ) అనే బిరుదును అందజేసి సత్కరించారు.
ఆ విజయానికి గుర్తుగా ఇతడు కాకతీయ పాలనా సూత్రం
(Triple T )
T- Tank
T- Town
T-Temple
ప్రకారం కొండపర్తి గ్రామంలో తన పేర చౌండ సముద్రం అనే పెద్ద చెరువుని తవ్వించి దానితో పాటు తన స్వగ్రామం ఐన కొండపర్తిలో ఆలయం నిర్మింపజేశాడు

ఇక నిర్మాణాల పరంగా చూస్తే కొండపర్తి గ్రామంలో గల ఆలయాలు ,నిర్మాణాలు ఇవి.
1. త్రికుటాలయం
2. సురాభాండేశ్వరాలయం
3.500 స్తంభాల దేవాలయం
4.విష్ణు ఆలయం
5.బురుజులు
6.నేలబొయ్యారం
7.చెరువు
8.శాసనాలు .

త్రికుటాలయం :

చౌoడసేనాని కొండపర్తి గ్రామం లో చౌండ్యేశ్వరాలయం పేరుతో ఒక త్రికుటాలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు.

గతంలో ఆలయాన్ని నిర్మించిన వారి పేరునే ఆలయాలకు పెట్టేవారు.

ఉదాహరణకు వరంగల్లు వేయిస్తంభాల గుడిలో రుద్రదేవ మహారాజు ప్రతిష్టించిన ఈశ్వరుడు రుద్రేశ్వరుడుగా , బేతరాజు ప్రతిష్టించిన ఈశ్వరుడు బేతేశ్వరుడుగా, పిల్లల మర్రిలో ఎఱకసానమ్మ ప్రతిష్టించిన దేవుడు ఎఱకేశ్వరుడుగా, రేచర్ల రుద్రసేనాని కట్టించిన ఆలయం రుద్రేశ్వరాలయంగా( తర్వాతి కాలంలో రామప్ప గుడి), చౌండసేనాని కట్టించినది చౌండేశ్వరాలయంగా (కొండపర్తి శివాలయం) పిలవబడ్డాయి.

ఈ ఆలయం ముందు ఉన్న శాసనంలో ఉన్న వివరాల ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తి అయిన రోజు అనగా క్రీ.శ 1125 రుదిరోద్గారి నామ సంవత్సరం వైశాఖమాసం శుక్లపక్షం April 17 th నాడు ఆలయంలో శివలింగాన్ని , విష్ణు మూర్తి ని , ప్రోలేశ్వరుడిని ప్రతిష్టించాడు.
ఆ ఆలయ ధూప దీపనైవేధ్యాల కోసం చౌండ్యపురం అనే అగ్రహారాన్ని , నారుకుర్కి అనే గ్రామాన్ని దానమిచ్చాడు. శాసనం ప్రకారం ప్రస్తుతం ఆలయం నిర్మించి 814 సంవత్సరాలు అయింది.

2 సంవత్సరాల క్రితం పురావస్తు శాఖ వారు ఆలయ పునరుద్ధరణ పేరుతో ఆలయాన్ని విప్పి ,స్తంభాలను శిల్పాలను కుప్పగా పోశారు.

ఆలయం పునాదిగా ఉపయోగించిన ఇసుక మాత్రం ఉంది.

ఈ ఆలయాన్ని కూడా ఇసుక పెట్టే పరిజ్ఙానం (sand box technology) అనే విధానం ప్రకారం నిర్మించారు.
ప్రస్తుతం ఆలయం లేదు కానీ " ప్రాచీన స్మారక చిహ్నాలే మన పూర్వీకులు మనకు ఇచ్చిన సంపద .వాటిని మనం కాపాడుకోవాలి." అని పురావస్తు శాఖ వారి బోర్డ్ మాత్రం ఉంది.

ఆ పక్కనే రెండు నంది విగ్రహాలు మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి.ఆ పక్కనే చౌండసేనాని వేయించిన ఒక శాసనం , గణపతి దేవుడి కాలం నాటి మరో శాసనం,ఆంజనేయస్వామి విగ్రహం,భైరవమూర్తి ,తదితర శిల్పాలుఉన్నాయి.మిగిలిన వాటిని గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ముందు, స్కూల్ ఆవరణలో ఉంచారు.వాటికి రక్షణ లేకపోవడంతో అవి అపహారణకి గురవుతున్నాయి.గత ఏడాది అందులో ఉన్న దాదాపు 5 అడుగుల వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు.
2 సంవత్సరాల క్రితం విప్పిన ఆలయాన్ని పునరుద్దరించడంలో పురావస్తు శాఖ ఇంతవరకూ ఒక్క రాయిని కూడా అటునుంచి తీసి ఇటు పెట్టలేదు ,పనులు కూడా కనీసం ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు.

సురాభాండేశ్వర ఆలయం:
కొండపర్తి గ్రామ పంచాయితీ పక్కనుంచి వెళ్తే కుడివైపు ఉంటుందీ ఆలయం..
ఆలయ ప్రవేశంలో రెండువైపులా ద్వారపాలక విగ్రహాలు మనల్ని ఆలయంలోకి ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి.

లోపలికి ప్రవేశించగానే వివిధ రకాల పరిమాణాల్లో 3 నందులు ఉన్నాయి.

ఇందులో రెండు కాకతీయ శైలిలో ఉండగా మరోటి చాళుక్య శైలిలో ఉంది.ఇదే ఆలయంలో దాదాపు10 సంవత్సరాల క్రితం ఒక రాతి ద్వజ స్తంభం ఉండేదని చెప్తారు.

ఆ స్తంభంపై భైరవమూర్తి ప్రతిమ చెక్కి ఉండేదట.

ప్రస్తుతం అది లేదు.ఆలయ ప్రవేశంలో నల్లరాతితో చెక్కిన 3 అడుగుల గణపతి విగ్రహం ఉంది.అంతరాలయంలో
శివలింగం పైన ఉన్న పైకప్పుని చూస్తే ఆశ్చరపోకమానం.అనేక సూక్ష్మరాతి విగ్రహాలు చెక్కి ఉన్నాయి.ఇంత సూక్ష్మ విగ్రహాలు,ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ తప్పితే మనం ఇంకేక్కడా చూడలేం.

ఆలయం శివలింగం పై భాగంలో ఉన్న కప్పు పైన గుర్రం పైన కూర్చుని ఉన్న ఒక యుద్ధ వీరుడి విగ్రహం కన్పిస్తుంది. ఈ విగ్రహం చౌoడ సేనానిది. విగ్రహాన్ని చూస్తే అతను ఎంత పరాక్రమ వంతుడో అర్ధం అవుతుంది.

500 స్తంభాల ఆలయం : కొండ పర్తి గ్రామంలో ఉన్న మరొక ఆలయం 500 స్తంభాల ఆలయం . ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేయబడిన ఆలయం .హనుమ కొండ లో ఉన్న వేయి స్తంభాల ఆలయం గురించి చాలా మంది కి తెలిసినప్పటికీ ఈ ఆలయం గురించి తెలియదు. ఇలాంటి ఆలయాలు జనగామ జిల్లా నిడిగొండ , సిద్దిపేట జిల్లా నంగునూరు , కరీంనగర్ జిల్లా లోని ఉప్పరపల్లి లో ఉన్నాయి.

ప్రస్తుతం ఆలయం పూర్తిగా ధ్వంసం అయి శిథిలావస్థలో ఉంది.

విష్ణు ఆలయం : గ్రామం లోని కోట బురుజులకు సమీపంలో ఉన్న ఈ ఆలయం 16 స్తంభాలతో కాకతీయ శైలిలో నిర్మాణం చేయబడింది. అంతరాలయం , గర్భగుడి ని కలిగి ఉంది. లోపల ఎటువంటి విగ్రహం లేదు. ఈ ఆలయం కూడా ప్రస్తుతం ఎవరి పట్టింపు లేక నిరాదరణ కు గురయింది.

వేణు గోపాల స్వామి దేవాలయం. :

గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆలయం ఇది. ఆలయం లో వేణుగోపాల స్వామి విగ్రహం తో పాటు నల్లరాతితో చెక్కిన

అనంత పద్మనాభ స్వామి విగ్రహం , గరుడ , ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి.

బురుజులు: ఒకప్పుడు సైనికులు పహారా కాయడానికి ఉపయోగపడ్ద బురుజులు నేడు శిధిలావస్తలో కూలడానికి సిద్దంగా ఉన్నాయి..
ఊరికి నాలుగువైపులా బురుజులు,వాటికింది నుండి రహస్య సొరంగ మార్గం ఉన్నాయి..వేణుగోపాలస్వామి ఆలయం పక్కనే ఉన్న రెండస్తుల బురుజు కొండపర్తి గ్రామానికే ప్రత్యేక ఆకర్షణ.దాని కింద నేలబొయ్యారం ఆనవాళ్లను మనం నేటికీ చూడోచ్చు.
శాసనాలు

కొండపర్తి గ్రామంలో వివిధ కాలాలకు చెందిన మూడు రాతి శాసనాలు లభించాయి. వాటిలో రాయబడిన వివరాల ఆధారంగా మనకు కొండపర్తి చరిత్ర తెలుస్తుంది.
1. క్రి. శ 9 వ శతాబ్దం నాటి ప్రాచీన తెలుగు లిపిలో రాయబడ్డ శాసనం ఊరి చివర చెరువు పక్కన ఉన్న గుట్ట మీద స్థానికులు "కొక్కెర గుండు" అని పిలిచే ఒక పెద్ద రాతి బండకి చెక్కబడి ఉంది.

ఆ శాసనం ప్రకారం:

పొలమెయరట్టోడి (కాకతీయుల కాలంలో గ్రామాధికారిని ఇలా పిలిచేవారు) అనే స్థానికాధికారి మంచికాళు కొడుకైన కొణ్డపకు భూమి కౌలు కి ఇచ్చి పండిన పంటలో సగం పంచుకొనే విధంగా నిర్ణయం జరిగింది.
తాంబూలము తీసుకుని యిచ్చిన భూమి. ఇది దానము కాదు.ఒక కట్టడి.

అంటే అలా నిర్ణయం జరిగిన సందర్భంలో పెద్దమనుషుల చేతను , సాక్షుల చేతను
తాంబూల స్వీకరింపజేశారు.
ప్రస్తుతం ఈ రకమైన తాంబూల ధారణ మనం పెళ్లి సమయం లో చూడవచ్చు.

2.గణపతిదేవ చక్రవర్తి ముఖ్య సేనాని యైన చౌండ సేనాని తాను నిర్మించిన చౌండ సముద్రం (వరంగల్ జిల్లాలోని కొండపర్తి చెరువు) వద్ధ వేయించిన శాసనంలో చేసిన విజ్ఞప్తి

"ఈ ధర్మసేతువు నృపులందరికీ ఒకేరకమైనది కాబట్టి మీతో సదా రక్షించబడాలనీ, భవిష్యత్ కాలాలలో వచ్చే రాజులందరినీ ప్రార్ధిస్తున్నాను. నావంశంవారుగానీ, ఇతరులుగానీ ఇకముందు ప్రభువులైనపుడు ఈ విధానాన్ని దోషరహిత మనస్కులై రక్షింతురుగాక, అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

ధర్మం శత్రువు-చేసినా సరే కష్టపడి రక్షించాలి. శత్రువు శత్రువేకానీ ధర్మం ఎవరికీ శత్రువు కాదు"

సమాజ సంపదలైన ప్రకృతి వనరుల రక్షణపై కాకతీయులకు ఉన్న అభిప్రాయం మనకు ఈ శాసనం ద్వారా వెల్లడి అవుతుంది.

3. మూడవ శాసనం శక సంవత్సరం 1162 (క్రి. శ 1242 ) లో అంతకు ముందు నిర్మాణం చేసి ఉన్న ప్రోలేశ్వర ఆలయం లో రుద్రేశ్వర , కేశవ మూర్తులను ప్రతిష్టాపన చేసి ఆలయానికి ప్రాకారాన్ని నిర్మాణం చేసినట్లు రాయబడింది.
మూడవ శాసనం సంస్కృత పద్యములలో శక సంవత్సరం 1125 (క్రి. శ 1203 )లో వేయబడింది.
ఈ శాసనం లో మాల్యాల వంశం వారి వివరాలతో పాటు కాకతీయుల శిల్పుల నైపుణ్యత శిల్ప నిర్మాణ సామర్థ్యాన్ని ,సమగ్రత ను గూర్చి గణపతిదేవుని కాలంనాటి కొండపర్తి శాసనం కింది శ్లోకంలో వర్ణించింది.
ప్రాకారోజయతి త్రికూటమ్ అభితస్తల్ తేన నిర్మాపితఃసుశ్లిష్టైః క్రమశీర్షకై రుపచితో నీలోపలైః కల్పితఃయశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకశిలా తక్షకైఃసంతక్ష్యేవ మహీయ సీమ్ ఇవ శిలాం యత్నాత్ సముత్తారితః
భావం :
నల్లని రాళ్లను సమానంగా నున్నగా చెక్కి,సన్నిహితంగా కూర్చి నిర్మించినత్రికూట ప్రాకారం విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలానిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహా ప్రయత్నంతో శిల్పులు నిర్మించారు.
కాకతీయ దేవాలయాల శిల్పుల నైపుణ్యం ఇటువంటి సమగ్రతను సంతరించుకుంది.

ఇతర చారిత్రక ఆధారాలు :

గ్రామం లోని ఊర చెరువుకు ఈశాన్యముగా ఉన్న గుట్ట పై ఉన్న సమతల ప్రదేశం లో నవీన శిలా యుగం నాటి మానవుడు తన రాతి పనుముట్లను పదును పెట్టుకోవడం కోసం రాతి పై నూరిన గుర్తులు కనపడతాయి.
గ్రామ సరిహద్దు లో తులసీమయ్య గడ్డ అనే ప్రాంతంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు ఆ యుగం నాటి మానవుల మనుగడని గుర్తు చేస్తున్నాయి.
గ్రామం లో వివిధ ప్రాంతాలలో లభించిన విగ్రహాలను , వాటి శిల్ప రీతులను బట్టి గ్రామం రాష్టకూట , చాళుక్య , కాకతీయుల కాలం నాటి రాజ వంశాల పరిపాలనలో ఉన్నట్లు చెప్పవచ్చు.

చెరువులు :

ఆనాడు అయినా ఈనాడు అయినా ప్రజలకు, ప్రభుత్వానికి వ్యవసాయం ముఖ్య ఆదాయ మార్గం. కాబట్టి కాకతీయ రాజులు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వారి పరిపాలనా కాలం లో కాకతీయ రాజులే కాక వారి సేనానులు, సామంతులు, ఉద్యోగులు, మతాచార్యులు, సంపన్నులు తటాకాలు నిర్మించడంపై అమిత శ్రద్ధ చూపారు.
ప్రకతి సిద్ధంగా వర్షపు రూపంలో వచ్చేనీటిని నిల్వ చేసుకునే లక్ష్యంలో కాకతీయుల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఆ నిర్మాణాల్లో భాగంగా

కొండ పర్తి గ్రామంలో రెండు చెరువుల నిర్మాణం జరిగింది.

ఒకటి 1000 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్న చౌoడసముద్రం కాగా మరొకటి ఊర చెరువు. ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయానికి ఈ రెండు చెరువుల నీరే ఆధారం.

కొండపర్తి గ్రామం లో ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లు , చారిత్రాక కట్టడాలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన వరంగల్ కి అతి సమీపంలో మా ఊరు ఉంది. కాబట్టి గ్రామంలోని ఆలయాలను ప్రభుత్వం పునరుద్ధరించి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.గ్రామానికి గత వైభవాన్ని పునరుద్దరించాలి
మారుపాటి శ్రీనివాస్ రెడ్డి ( గ్రామస్తుడు )

గతంలో పి.వి రంగారావు పురావస్తు శాఖ మంత్రి గా పనిచేసినప్పుడు కొండపర్తి గ్రామాన్ని సందర్శించి గ్రామంలొనే ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం గ్రామములో వివిధ ప్రాంతాల్లో ఉన్న 150 కి పైగా విగ్రహాలను , శిల్పాలని సేకరించి త్రికుటాలయం ఎదురుగా పెట్టారు. మ్యూజియం ప్రతిపాదన అటకెక్కింది. కొన్ని శిల్పాలను హైదరాబాద్ , వరంగల్ మ్యూజియాలకు తరలించారు. గత ఏడాది ఒక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు.
కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామ చారిత్రాక విశిష్టత ని కాపాడాలి.
సోమయ్య (మాజీ సర్పంచ్ )

https://photos.google.com/share/AF1QipP0sw9Ba1m9kFNyOHrPtst6XXwMPCe8CWfahirRL46hz-yJME8XPC7Q_z6jd9T39w?key=TTN4UkRHOTBsenRwbzJLajlIQl9GM0dwU2xHbjB3

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Social Post Telugu
Top