ఇప్పటికే గ్రూప్ 1 సర్వీసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది.
ఫారెస్ట్ సర్వీస్ మరియు ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో పలు ఖాళీలను భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మరియు కంప్యూటర్ డ్రాట్స్ మేన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. క్యారీడ్ ఫార్వార్డ్ మరియు తాజా ఖాళీలను నియామకం కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జిల్లాల వారిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? కంప్యూటర్ డ్రాట్స్ మేన్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? జీతం ఎంత? అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఖాళీలు: 08
- క్యారీడ్ ఫార్వార్డ్ ఖాళీలు: 03
- తాజా ఖాళీలు: 05
జోన్ల వారీగా క్యారీడ్ ఫార్వార్డ్ ఖాళీలు: 03
జోన్ల వారీగా తాజా ఖాళీలు: 05
- జోన్ 2: 01
- జోన్ 3: 03
- జోన్ 4: 01
జిల్లాల వారీగా జోన్ల వివరాలు:
- జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
- జోన్ 2: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
- జోన్ 3: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
- జోన్ 4: చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జీతం: రూ. 48,440/- నుంచి 1,37,220/-
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టు అర్హతలు:
- రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్(అగ్రికల్చర్/ కెమికల్/సివిల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథ్ మెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు పరిమితి:
- 01/07/2022 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వయసు సడలింపు:
- ఎస్సీ/ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్: 05 ఏళ్లు
- ఎక్స్ సర్వీస్ మేన్, ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ గా పని చేసిన వారికి: 03 ఏళ్లు
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు(కార్పొరేషన్, మున్సిపాలిటీ ఉద్యోగులకు కాదు): 05 ఏళ్లు
దరఖాస్తు సంబంధిత వివరాలు:
- దరఖాస్తు ఫీజు: రూ. 250/-
- పరీక్ష ఫీజు: రూ. 120/-
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి పరీక్ష ఫీజు: లేదు
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 15/11/2022
- దరఖాస్తు చివరి తేదీ: 05/12/2022
- దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: 04/12/2022 అర్ధ రాత్రి 11.59 వరకూ మాత్రమే
దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
- https://psc.ap.gov.in లోకి వెళ్లి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఇంతకు ముందే రిజిస్టర్ అయితే గనుక ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వండి
- నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఇతర నోటిఫికేషన్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఇతర వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి
కంప్యూటర్ డ్రాట్స్ మేన్ గ్రేడ్ 2 ఖాళీలు: 08 (క్యారీడ్ ఫార్వార్డ్ ఖాళీలు)
జిల్లాల వారీగా ఖాళీలు:
- గుంటూరు: 01
- అనంతపురం: 01
- కడప: 01
- కర్నూలు: 01
- నెల్లూరు: 01
- చిత్తూరు: 03
కంప్యూటర్ డ్రాట్స్ మేన్ పోస్టుకి కావాల్సిన అర్హతలు:
- పదో తరగతి పాసై ఉండాలి.
- ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా ఇన్స్టిట్యూట్ లో డ్రాట్స్ మేన్ గా ఏదో ఒక సంబంధిత సబ్జెక్టులో 2 ఏళ్ల కోర్స్ చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
కంప్యూటర్ డ్రాట్స్ మేన్ జీతం: రూ. 34,580/- నుంచి రూ. 1,07,210/-
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
వయసు సడలింపు:
- బీసీ, ఈడబ్ల్యూఎస్: 05 ఏళ్లు
- ఎస్సీ, ఎస్టీ: 10 ఏళ్లు
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు(కార్పొరేషన్, మున్సిపాలిటీ ఉద్యోగులకు కాదు): 05 ఏళ్లు
దరఖాస్తు సంబంధిత వివరాలు:
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో
- దరఖాస్తు ఫీజు: రూ. 250/-
- పరీక్ష ఫీజు: రూ. 80/-
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 10/11/2022
- దరఖాస్తు చివరి తేదీ: 30/11/2022
- దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 29/11/2022 అర్ధరాత్రి 11.59 వరకూ మాత్రమే
దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ: