Posts
అర్జున్ టెండూల్కర్ మెయిడిన్ వికెట్..వైరల్

ముంబై : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ‘ఇ’ గ్రూప్‌లో హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత ముంబై 143 పరుగులకు ఆలౌటైంది. హరియాణా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 144 పరుగలు చేసి గెలిచింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌తో సీనియర్ ముంబై జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్‌లో అర్జున్ (0 నాటౌట్) ఖాతా తెరవకపోయినా... బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అర్జున్ టెండూల్కర్ తీసిన మెయిడిన్ వికెట్ వైరల్‌గా మారింది. హరియాణా ఓపెనర్ సీకే బిష్నోయ్‌ను ఔట్ చేసి సీనియర్ ముంబై జట్టు తరఫున మెయిడిన్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి బిష్నోయ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.(లంచ్‌కు ముందే ఆసీస్ ఆలౌట్)
అయ్యో... ఆంధ్ర
ఆంధ్ర జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘ఇ’లోనే శుక్రవారం పుదుచ్చేరి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర 226 పరుగుల భారీ స్కోరు చేసినా ఓడిపోవడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర... శ్రీకర్ భరత్ (34 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ బటి రాయుడు (26 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి జట్టును షెల్డన్ జాక్సన్ ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. షెల్డన్ జాక్సన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. దాంతో దుచ్చేరి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి గెలిచింది. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. (36 బంతుల్లోనే శతకం...ఫాస్టెస్ట్ రికార్డు)