Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిరాజ్‌, సుందర్‌ను మరోసారి అవమానించిన ఆసీస్‌ ఫ్యాన్స్‌

సిరాజ్‌, సుందర్‌ను మరోసారి అవమానించిన ఆసీస్‌ ఫ్యాన్స్‌

Super Hero 5 years ago

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నేడు ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మొదటి రోజు ముగిసింది. అయితే అనుభవం లేని బౌలర్లతో బరిలోకి దిగ్గిన భారత జట్టు పరుగులను కట్టడి చేసింది కానీ వికెట్లు త్వరగా సాధించలేకపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్‌ బౌలర్‌ సిరాజును ఆసీస్‌ ఫ్యాన్స్‌ మరోసారి టార్గెట్‌ చేశారు. గబ్బాలో నాల్గో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో కొందరు ఆసీస్‌ ఫ్యాన్స్‌ సిరాజ్‌, సుందర్‌ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీం ఇండియా ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేశారు. కొందరు ఇండియా ఫ్యాన్స్‌ ఆసీస్‌ సిరీస్‌ను రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. వారం రోజులు గడవక ముందే సిరాజ్‌పై రెండుసార్లు ఆసీస్‌ ఫ్యాన్స్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు.

సిడ్నీలో జరిగిన మూడో టెస్టు సందర్భంగా రెండు రోజులు జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తమ ఫ్యాన్స్‌ తరఫున టీం ఇండియా ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి ఆసీస్‌ ఫ్యాన్స్‌ సుందర్‌, సిరాజ్‌ను అవమానించారు. అయితే...

దీనిపై టీం ఇండియా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇలాంటి టీంతో, ఆ దేశంలో ఆడటం కంటే.. సిరీస్‌ క్యాన్సల్‌ చేసుకోవడమే బెటర్‌ అని అంటున్నారు. 

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Super Hero