Saturday, 23 Jan, 8.20 pm Super News

Posts
శాంసన్‌ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌

జొహాన్నెస్‌బర్గ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2021 సీజన్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ తనని అట్టిపెట్టుకోవడంపై దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2021లోనూ రాజస్థాన్ జట్టు‌తో కొనసాగడం సంతోషకరమని, ఒక కుటుంబంలా ఉండే ఆ ఫ్రాంఛైజీలోని వాతావరణం తనకెంతో ఇష్టమని ట్విట్టర్ వేదికగా చెప్పాడు. ఈసారి కొత్త సారథి సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నానని, అతడి నేతృత్వంలో జట్టు విజయాల కోసం తోడ్పడడానికి ఆసక్తిగా ఉన్నా అని మిల్లర్‌ తెలిపాడు.

డేవిడ్ మిల్లర్‌ చాలా కాలం కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. 2014 సీజన్‌లో 446 పరుగులు చేసి పంజాబ్ తొలిసారి ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అందువల్లే పంజాబ్‌ అతడిని 2019వరకు కొనసాగించింది. అయితే చివరి 2-3 సీజన్లలో అతడి ప్రదర్శన బాలేకపోవడంతో.. 2020 సీజన్‌కు ముందు వదిలేసింది. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ మిల్లర్‌ను కొనుగోలు చేసింది.

యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో మిల్లర్‌ ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడి రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితమయ్యాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Super News
Top