Posts
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?

ముంబై: టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ని మరింత పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కొత్త టెస్టును త్వరలోనే తీసుకువస్తోంది. అంతేకాదు ఏడాదికి మూడు సార్లు నిర్వహిస్తారట. టీమిండియా జట్టు ఎంపికలో యో-యో టెస్ట్‌ను ప్రామాణికం చేయడం కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల హయాంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే.. ఏ ఆటగాడు అయినా సరే తప్పనిసరిగా యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవ్వాల్సిందే. అయితే ఈ ఏడాది నుంచి బీసీసీఐ ఆ టెస్టుని మరింత కఠినతరం చేస్తోంది.
8 నిమిషాల్లోనే 2 కిమీ
8 నిమిషాల్లోనే 2 కిమీ
ఇప్పటివరకు యో-యో ఫిట్నెస్ టెస్టులో ఓ క్రికెటర్ 17.1 పాయింట్లు సాధిస్తే.. సదరు ఆటగాడు పాస్ అని బీసీసీఐ పరిగణించేది.
ఇప్పుడు కొత్తగా ఆటగాళ్ల వేగం, సహనానికి పరీక్ష పెట్టేందుకు ఓ టెస్టుని తెరపైకి తీసుకువస్తోంది. అదేంటంటే.. ఓ ఫాస్ట్ బౌలర్ 2 కిమీ దూరాన్ని 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. అదే ఓ బ్యాట్స్‌మెన్ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో పరుగు పెట్టాలి.
బ్యాట్స్‌మెన్‌కు 15 సెకన్లు అదనపు సమయం ఇచ్చింది. ఏడాదిలో మూడు సార్లు ఈ