Dailyhunt
142 కోట్ల ఖరీదైన నెక్లెస్‌తో.. మెట్‌గాలాలో మెరిసిన సుధారెడ్డి

142 కోట్ల ఖరీదైన నెక్లెస్‌తో.. మెట్‌గాలాలో మెరిసిన సుధారెడ్డి

సూర్య 6 days ago

ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలాలో హైదరాబాదీ బిలియనీర్ సుధా రెడ్డి సుమారు 142 కోట్ల విలువైన నెక్లెస్‌ను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నెక్లెస్ ఆమె ప్రైవేట్ కలెక్షన్‌కు చెందినది.

స్టైలిస్ట్ మారియల్ హెనిన్ రూపొందించిన ఈ నెక్లెస్‌లో త్రికోణ రోజ్‌కట్ వజ్రాలు, పువ్వుల అల్లిక తరహాలో అమర్చిన రత్నాలు ఉన్నాయి. నెక్లెస్ మధ్యలో 550 క్యారెట్ల డీప్ వయొలెట్, బ్లూ టాంజానియా డైమండ్ ఉంది. ఈ ఆకర్షణీయమైన పెండెంట్‌ను 'క్వీన్ ఆఫ్ మెరిలానీ' అని పిలుస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu