Dailyhunt
అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా

అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా

సూర్య 1 week ago

స్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో, బుధవారం మధ్యాహ్నం గౌహతి రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. 126 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ కూటమి 102 స్థానాలు గెలుచుకోవడంతో, హిమంత బిశ్వ శర్మ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu