Dailyhunt
BCBలో భారీ సంక్షోభం: వరుస రాజీనామాలు, భారత్‌పై ఆరోపణలు

BCBలో భారీ సంక్షోభం: వరుస రాజీనామాలు, భారత్‌పై ఆరోపణలు

సూర్య 1 week ago

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నికైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఇప్పటికే ఏడుగురు సభ్యులు రాజీనామా చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.

ముఖ్యంగా ఏప్రిల్ 4, 2026న ఒక్కరోజులోనే నలుగురు రాజీనామా చేయడం బోర్డు స్థిరత్వంపై సందేహాలు రేకెత్తిస్తోంది.అయితే BCB అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మాత్రం తన పదవికి రాజీనామా చేయకుండా, 'నేనే చివరి వ్యక్తిని' అంటూ తన దృఢ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సంక్షోభానికి భారత్‌తో సంబంధం ఉన్న T20 వరల్డ్ కప్ వివాదమే కారణమని తెలుస్తోంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని అమీనుల్ ఇస్లాం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.అక్టోబర్ 2025లో ఎన్నికైన 25 మంది డైరెక్టర్లలో ఇప్పటికే 7 మంది వైదొలిగారు. అంతకుముందే ఇష్టియాక్ సాదెక్, అమ్జాద్ హోసెయిన్, యాసిర్ మహమ్మద్ ఫైసల్ తమ పదవులకు రాజీనామా చేశారు. బోర్డులో అంతర్గత విభేదాలు, రాజకీయ జోక్యం, ఎన్నికలలో అవకతవకల ఆరోపణలు ఈ రాజీనామాలకు కారణమని సమాచారం.బోర్డు సమావేశం అనంతరం జమునా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీనుల్ ఇస్లాం బుల్‌బుల్ మాట్లాడుతూ, 'నేను ఈ కుర్చీలోనే కొనసాగుతాను. ఇప్పుడు నేనే చివరి వ్యక్తిని. మా డైరెక్టర్లు అందరూ అంకితభావంతో పనిచేసే నిజాయితీగలవారు. వీరితో కలిసి బంగ్లాదేశ్ క్రికెట్‌కు సేవ చేయాలని ఉంది' అని తెలిపారు.అలాగే, 'ICCలో పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక బంగ్లాదేశీయుడిని నేను. దేశం కోసం అన్నీ వదిలి ఇక్కడికి వచ్చాను. అవసరమైతే మరో మార్గం చూసుకుంటాను, కానీ దేశానికి సేవ చేయడం నా లక్ష్యం' అని స్పష్టం చేశారు.
*భారత్‌పై ఘాటు విమర్శలు : ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా 2026 T20 వరల్డ్ కప్ నిలిచింది. భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీలో భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది.ఈ విషయంపై అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ, 'మా డిమాండ్ ఒక్కటే — వరల్డ్ కప్ ఆడాలి, కానీ భారత్‌లో కాదు' అని అన్నారు. భారత్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయని, మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ICCను కోరినప్పటికీ, అది అంగీకరించలేదని విమర్శించారు.ICC ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపిస్తూ, మ్యాచ్ వేదికలను మార్చకపోవడం, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడం వంటి నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu