గ్యాస్ కొరత ఆందోళనల మధ్య దేశానికి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. 'గ్రీన్ ఆశా' అనే భారత నౌక సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణిస్తోంది.
ఈ నౌకలో సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. రెండు రోజుల క్రితం 'గ్రీన్ సాన్వీ' ట్యాంకర్ కూడా 46,650 టన్నుల గ్యాస్‌తో భారత్‌కు బయలుదేరింది. దీంతో త్వరలోనే దాదాపు 66 వేల టన్నులకు పైగా ఎల్పీజీ అందుబాటులోకి రానుంది

