రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి భారత వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎల్లో అలర్ట్ ను జారీ చేస్తారు.
ఈ ఏరియాల్లో 7. 5 -15 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ఏరియాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేస్తారు. ఇక్కడ 15 - 33 మిల్లిమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంటుంది.

