Dailyhunt
దానిమ్మ తొక్కలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

దానిమ్మ తొక్కలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

సూర్య 1 week ago

సాధారణంగా పారేసే దానిమ్మ తొక్కల్లో ఫినోలిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం, పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ తొక్కల పొడిని గులాబీ నీటితో కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. విరేచనాలు, రక్తవిరేచనాలకు దానిమ్మ తొక్కల పొడిని మజ్జిగతో కలిపి తాగడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రు నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మొలల సమస్యకు కూడా ఆయుర్వేద విరుగుడుగా పనిచేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu