Dailyhunt
దుబాయ్‌లో ఎన్నారై డ్రైవర్‌కు రూ.64.6 కోట్లు లాటరీ!

దుబాయ్‌లో ఎన్నారై డ్రైవర్‌కు రూ.64.6 కోట్లు లాటరీ!

సూర్య 5 days ago

దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన అబ్దుల్ రషీద్, అబుదాబిలో జరిగిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో 25 మిలియన్ దిర్హమ్స్ (సుమారు రూ. 64.6 కోట్లు) గెలుచుకున్నారు.

మే 3వ తేదీన జరిగిన ఈ డ్రాలో, ఆయన టికెట్ నంబర్ 012318కు జాక్‌పాట్ తగిలింది. అయితే, ఈ భారీ మొత్తాన్ని ఆయన ఒక్కరే కాకుండా, మరో 26 మంది స్నేహితులతో కలిసి పంచుకోనున్నారు. గత 17 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్న అబ్దుల్ రషీద్, గత ఆరేళ్లుగా తన స్నేహితులతో కలిసి ప్రతినెలా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. గెలుచుకున్న డబ్బును కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, తాను డ్రైవర్‌గా కొనసాగుతానని అబ్దుల్ రషీద్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu