Dailyhunt
ఏపీలో నాలుగు లైన్లతో కొత్త నేషనల్  హైవే రెడీ ?

ఏపీలో నాలుగు లైన్లతో కొత్త నేషనల్ హైవే రెడీ ?

సూర్య 0 months ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి తమిళనాడును కనెక్ట్ చేసే.. చిత్తూరు-తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ట్రయల్ రన్‌ నిర్వహించారు.

ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ హైవేపైకి వాహనాలను అనునమతించారు. ఈ హైవేలో సుమారు 100 కి.మీ వేగంతో వెళితే దాదాపు గంటన్నరలోనే తమిళనాడుకు, పోర్టుకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే ఈ హైవేపైకి వాహనాలను పూరిస్థాయిలో అనుమతించనున్నారు.. టోల్ రుసుము వసూలు చేయనున్నారు. ఈ హైవే మొత్తం 116 కిలోమీటర్లు ఆరు లైన్లుగా ఉంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 95 కిలో మీటర్లు ఉంది.. మిగిలిన 21 కిలోమీటర్లు తమిళనాడులో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu