డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె, సుపర్ణా శర్మలకు ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు లభించింది. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగం కింద ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఆనంద్, సుపర్ణ ఈ అవార్డును పంచుకోనున్నారు. ఈ అవార్డు పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించబడుతుంది.

