Dailyhunt
జనసేన పార్టీ శ్రేణులతో మంత్రి నాదెండ్ల మనోహర్ ?

జనసేన పార్టీ శ్రేణులతో మంత్రి నాదెండ్ల మనోహర్ ?

సూర్య 0 months ago

నసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందనుందని తెలిపారు.

ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులంతా పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు. దీపాలు వెలిగించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu