Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొద్దిసేపట్లో పెళ్లి.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి!

కొద్దిసేపట్లో పెళ్లి.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి!

సూర్య 3 weeks ago

TG: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామం సమీపంలో బుధవారం పెట్రోల్ పంప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో సహా 8 మంది ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది బంధువులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుకకు కొద్దిసేపటి ముందు జరిగిన ఈ ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu