నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీల మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని పేర్కొంది.
ఆ తర్వాత కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించింది. మే నెల చివరి రెండు వారాల్లో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కారణంగా దక్షిణ రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశముంది.

