Dailyhunt
మెదక్: ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. భర్తపై భార్య ఫిర్యాదు

మెదక్: ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. భర్తపై భార్య ఫిర్యాదు

సూర్య 3 weeks ago

మెదక్ జిల్లా కేంద్రంలో ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి వద్దంటున్న భర్తపై కేసు నమోదైంది. మామిండ్ల సురభికి 2023లో మెదక్‌కు చెందిన రాహుల్‌తో వివాహం జరిగింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, రూ.15 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, పెళ్లైన 3 నెలల నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆడపిల్ల పుట్టడంతో తనను ఇంటికి రానివ్వడం లేదని, న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu