వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, సమావేశం అనంతరం మేయర్ గుండు సుధారాణిని కలిసి అభినందించారు.
నగర అభివృద్ధిలో మేయర్ కృషి ప్రశంసనీయమని, రహదారుల విస్తరణ, పారిశుధ్యం, పచ్చదనం వంటి రంగాల్లో తీసుకుంటున్న చర్యలు ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు. కేంద్ర నిధులు, స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల అమలులో సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా సమన్వయంతో నగర అభివృద్ధికి కృషి చేస్తామని ఇద్దరూ స్పష్టం చేశారు.

