శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. శనివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను కలిసి, వారికి ధైర్యం చెప్పారు.
ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

