Dailyhunt
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: తారానగర్‌లో ఉచిత దంత వైద్య శిబిరం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: తారానగర్‌లో ఉచిత దంత వైద్య శిబిరం

సూర్య 3 days ago

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని తారానగర్ వీకర్ సెక్షన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, స్మిత దంత వైద్యశాల సంయుక్తంగా ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి.

ఈ శిబిరంలో డాక్టర్లు శ్రీధర్ రెడ్డి, స్వాతి, భువన విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు, బ్రష్‌లను పంపిణీ చేశారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. దంత సంరక్షణలో అశ్రద్ధ వహిస్తే ఉదరకోశ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని వైద్యులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu