Dailyhunt
Public Provident Fund లోన్ ఎలా తీసుకోవాలి? పూర్తి గైడ్

Public Provident Fund లోన్ ఎలా తీసుకోవాలి? పూర్తి గైడ్

సూర్య 3 weeks ago

దీర్ఘకాలిక పొదుపు పథకాలలో అత్యంత భద్రమైనదిగా భావించే Public Provident Fund (PPF) ఇప్పుడు పెట్టుబడిదారులకు రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ప్రభుత్వ హామీ, పన్ను రాయితీలు మాత్రమే కాకుండా, అత్యవసర సమయంలో డబ్బు ఉపయోగించుకునే అవకాశం ఉండటం వల్ల ఈ పథకం మరింత ప్రజాదరణ పొందుతోంది.సాధారణంగా PPF ఖాతాకు 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.

అయినప్పటికీ, ఖాతా ప్రారంభమైన మూడో సంవత్సరం నుంచి ఆరవ సంవత్సరం మధ్యలో ఖాతాదారులు తమ డిపాజిట్‌పై లోన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఐదు సంవత్సరాలు పూర్తికాకముందే కూడా అత్యవసర అవసరాల కోసం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.రుణ పరిమితి విషయానికి వస్తే, ఖాతా ప్రారంభించిన రెండో సంవత్సరం చివరికి ఉన్న బ్యాలెన్స్‌లో గరిష్టంగా 25 శాతం వరకు మాత్రమే లోన్ పొందవచ్చు. ఇది పెట్టుబడిదారులు అధికంగా డబ్బు తీసుకుని భవిష్యత్ సేవింగ్స్‌పై ప్రభావం పడకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన నియమం.ఈ రుణాన్ని తీసుకున్న తర్వాత 36 నెలలలోపు తిరిగి చెల్లించాలి. ఈ గడువులోనే చెల్లిస్తే వడ్డీ రేటు సంవత్సరానికి కేవలం 1% మాత్రమే ఉంటుంది.

అయితే నిర్ణీత సమయంలో రుణాన్ని తిరిగి చెల్లించకపోతే, వడ్డీ రేటు 6% వరకు పెరుగుతుంది. కాబట్టి సమయానికి రీపేమెంట్ చేయడం చాలా అవసరం.మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, లోన్ తీసుకున్నప్పటికీ మీ PPF ఖాతాలోని మొత్తం మీద సాధారణ వడ్డీ కొనసాగుతూనే ఉంటుంది. అంటే మీ పొదుపు వృద్ధి ఆగిపోదు. మొత్తంగా, అత్యవసర పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో డబ్బు అవసరమయ్యే వారికి PPF లోన్ ఒక సురక్షితమైన, ఉపయోగకరమైన ఎంపికగా ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu