Dailyhunt
రాజధానిలో అంతులేని దోపిడీ జరుగుతోంది: మాజీ మంత్రి నాగార్జున

రాజధానిలో అంతులేని దోపిడీ జరుగుతోంది: మాజీ మంత్రి నాగార్జున

సూర్య 6 days ago

మరావతిలో పేదలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలో మాట్లాడుతూ రాజధానిలో అంతులేని దోపిడీ జరుగుతోందని, ఎకరం రూ.50 కోట్లు ఉందని ప్రచారం చేస్తూ, ఐదు ఎకరాలను రూ.3.5 కోట్లకు ఎలా కొన్నారని ఆయన ప్రశ్నించారు.

వైఎస్‌ జగన్‌ 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు రద్దు చేశారని, చంద్రబాబు భారీ బంగ్లాలు కట్టుకోవచ్చని, పేదలు ఇళ్లు కట్టుకోకూడదా అని నిలదీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu