Dailyhunt
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

సూర్య 5 days ago

లయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు సంతోష్ కె. నాయర్ (65) కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన భార్య శుభశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సంతోష్ నాయర్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందారు. 1982లో సినీ రంగ ప్రవేశం చేసిన సంతోష్ నాయర్, 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం 'మోహినియాట్టం' ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu