Dailyhunt
RR vs MI: జైశ్వాల్, వైభవ్ దుమ్మురేపారు.. ముంబైకి భారీ టార్గెట్!

RR vs MI: జైశ్వాల్, వైభవ్ దుమ్మురేపారు.. ముంబైకి భారీ టార్గెట్!

సూర్య 3 weeks ago

ర్షం కారణంగా Rajasthan Royals vs Mumbai Indians మ్యాచ్ ఆలస్యమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.

వైభవ్ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి దూకుడు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సులు ఉండటం విశేషం.మరోవైపు జైశ్వాల్ మరింత అగ్రెసివ్‌గా ఆడి 32 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.సూర్యవంశీ ఔటైన తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం Riyan Parag వేగంగా ఆడే ప్రయత్నంలో 20 పరుగుల వద్ద ఔటయ్యాడు (2 ఫోర్లు, 1 సిక్స్). చివర్లో హెట్‌మేయర్ భారీ షాట్లు ఆడలేకపోయాడు.ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ రెండు వికెట్లు తీయగా, Shardul Thakur ఒక వికెట్ సాధించాడు.మొత్తంగా చూస్తే 11 ఓవర్ల షార్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోర్ నమోదు చేసి ముంబై ముందు బలమైన టార్గెట్ ఉంచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu