Dailyhunt
రూ.1700 కోట్ల క్లబ్‍లో 'ధురంధర్ 2'

రూ.1700 కోట్ల క్లబ్‍లో 'ధురంధర్ 2'

సూర్య 3 weeks ago

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 చిత్రం మార్చి 19న విడుదలైంది. దాదాపు మూడు వారాలు గడిచినా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రూ.2000 కోట్ల వైపు దూసుకుపోతోంది. అయితే మూడో వారం కలెక్షన్లు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్ల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో, సినిమా ఓటీటీ రిలీజ్ పై చర్చ జరుగుతోంది. 'ధురంధర్ 1' డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, సీక్వెల్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu