Dailyhunt
సీఎం రేవంత్‎కు కేరళ సీఎం ఘాటు కౌంటర్‌ ?

సీఎం రేవంత్‎కు కేరళ సీఎం ఘాటు కౌంటర్‌ ?

సూర్య 3 weeks ago

కేరళలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నేతల మధ్య డైలాగ్ లు పేలుతున్నాయి. అయితే ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో మాట్లాడిన ఆయన… సీఎం పినరయి విజయన్ ను టార్గెట్ చేశారు.కేరళను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారంటూ కూడా మాట్లాడారు.

పదేండ్ల పాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్ కు… తెలంగాణను పదేండ్ల పాటు పాలించిన కేసీఆర్ మధ్య అనేక పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానిచంారు. అవినీతి, అసమర్థ, కుటుంబ పాలన విషయంలో వారిద్దరూ ఒక్కటేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు కేరళ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని ఆరోపించడం సరైంది కాదని చెప్పారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి సోషల్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.కేరళలో అవినీతి తక్కువగా ఉండటంతో పాటు పేదరికం కూడా తక్కువగా ఉందని తెలిపారు. అక్షరాస్యతలో తమ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో కూడా కేరళ ముందుందని పేర్కొన్నారు. జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే వారు తమ వద్ద పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu