Dailyhunt
తిరుమల హుండీలో రూ.400 కోట్ల పాత నోట్లు

తిరుమల హుండీలో రూ.400 కోట్ల పాత నోట్లు

సూర్య 3 weeks ago

AP: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు భారీగా వస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ వద్ద దాదాపు రూ.400 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నోట్ల మార్పిడి కోసం టీటీడీ పలుమార్లు వినతి చేసినా.. కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా, రద్దు చేసిన రూ.2 వేల నోట్లు కూడా హుండీలో అధికంగానే వస్తున్నాయని తెలిసింది. ప్రతి నెలా రూ.30-35 కోట్లు వస్తుండగా.. బ్యాంకుల ద్వారా రెండు నెలలకోసారి మార్పిడి చేసుకుంటున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu