రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పరిధిలోని తుర్క యంజాల్ ఏ వి నగర్ 2 కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఈ ఆదివారం వైభవంగా జరగనుంది.
శుక్రవారం యంత్ర పూజలు, హోమాలు, శనివారం ఊరేగింపు, ఆదివారం విగ్రహ ప్రతిష్ట, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దామోదర్ రావు, వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, కాలనీ ఆర్గనైజర్ శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ మహోత్సవం కోసం కాలనీవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

