రాష్ట్రంలో రైతుల పక్షపాతి ప్రభుత్వం నడుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అనేవారని, కానీ ప్రజా ప్రభుత్వంలో వరి వేసిన రైతులకు మద్దతు ధర, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
రైతులకు ఎకరానికి రూ.12 వేలతో పాటు వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని, మూడు, నాలుగు రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

